సామాన్యులకు షాక్ తగిలింది. హైదరాబాద్‌లో కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. మార్చిలో తగ్గిన ధరలు ఇప్పుడు మళ్లీ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లోని రిటైల్ షాపుల్లో ఒక్కో గుడ్డును రూ.7కు అమ్ముతున్నారు. హోల్‌సేల్ షాపుల్లో ఒక ట్రే గుడ్ల ధర రూ.160 నుంచి రూ.180 వరకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండల కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో ఉత్పత్తి తగ్గి ఈ ధరల పెరుగుదలకు కారణమైందని సమాచారం.