పెరిగిన ఇంటి భోజనం తయారీ ఖర్చులు

44చూసినవారు
పెరిగిన ఇంటి భోజనం తయారీ ఖర్చులు
దేశంలో ఇంటి భోజనం తయారీ ఖర్చులు పెరిగినట్లు క్రిసిల్‌ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే వంట గ్యాస్ ధర సగటున 10 శాతం, ఉల్లి 20 శాతం, వంటనూనె 11 శాతం, చికెన్ ధరలు 14 శాతం పెరిగినట్లు తెలిపింది. దీంతో వెజ్‌ భోజనం తయారీ ఖర్చు 4 శాతం, నాన్‌వెజ్‌ భోజనం ఖర్చు 9 శాతం పెరిగింది. అయితే బంగాళదుంప ధర 12 శాతం, టమాటా ధర 2 శాతం తగ్గడం కొంత ఊరటనిచ్చింది. పెరిగిన వంట సరుకుల ధరల ప్రభావం గృహ బడ్జెట్‌పై పడుతోందని ఈ నివేదిక పేర్కొంది.

సంబంధిత పోస్ట్