దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఆలీపూర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 421కి పడిపోయింది. అత్యధికంగా 421, అత్యల్పంగా 216 AQI నమోదు అయింది. ఈ కాలుష్యంపై అధికార, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ప్రజలు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.