తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ

13262చూసినవారు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ
AP: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో క్యూ శిలాతోరణం వరకు చేరింది. టోకెన్‌ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 68,095 మంది భక్తులు దర్శించుకోగా, 23,932 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.7 కోట్లు వచ్చింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్