ఏఐ 75 శాతం పనులను చేస్తున్నప్పటికీ, ఉద్యోగులపై ఒత్తిడి తగ్గకపోగా ఐదు రెట్లు పెరిగిందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. టెక్ దిగ్గజ సంస్థల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఏఐ పనిని సులభతరం చేసినా, పెరిగిన పని వేగంతో పాటు మేనేజ్‌మెంట్ అంచనాలు కూడా పెరిగిపోవడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పనిని పూర్తి చేసే బాధ్యత ఏఐ తీసుకున్నా, సరైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత మనిషిపై పడటంతో నిరంతరం ఆలోచించాల్సి వస్తోంది. కంపెనీలు కేవలం అవుట్‌పుట్ పైనే కాకుండా, ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.