IND vs NZ: కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆఖరి ఓవర్‌ను ప్రసిద్ధ్ కృష్ణ వేయగా, ఇందులో రెండు ఫోర్లు సహా 14 పరుగులు వచ్చాయి. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (84), హెన్రీ నికోల్స్ (62), డేవన్ కాన్వే (56) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే 301 పరుగులు చేయాల్సి ఉంది.