ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. సూపర్-4లో రెచ్చగొట్టే హావభావాలు ప్రదర్శించిన పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్‌కు ఫైనల్‌లో బుమ్రా కౌంటర్ ఇచ్చాడు. 17.5 ఓవర్లో వేసిన యార్కర్‌కు రవూఫ్ క్లీన్‌బౌల్డ్ కాగా, వెంటనే బుమ్రా విమానం కూలినట్లుగా సంజ్ఞ చేశాడు. ఈ దృశ్యం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు బుమ్రాను ప్రశంసిస్తున్నారు.