IND vs WI: అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఓవర్‌లో వెస్టిండీస్‌కు రనౌట్ ప్రమాదం తప్పింది. వరుణ్ చక్రవర్తి చురుకైన ఫీల్డింగ్‌తో బంతిని వేగంగా అందుకున్నాడు. స్ట్రైకర్ రోస్టన్ ఛేజ్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరుగెత్తగా, షై హోప్ అతడిని వెనక్కి పంపించాడు. ఆ సమయంలో వరుణ్ బంతిని స్ట్రైకింగ్ ఎండ్ వైపు విసిరి ఉంటే ఛేజ్ ఔటయ్యే అవకాశముండేది. ఈ ఓవర్‌లో ఛేజ్ రెండు ఫోర్లు బాదాడు. మూడు ఓవర్లకు విండీస్ స్కోరు వికెట్ నష్టం లేకుండా 23 పరుగులు చేసింది.