భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (55) ఔటయ్యాడు. మపోస బౌలింగ్‌లో సికందర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 150 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా (1*) క్రీజులో ఉన్నాడు. ఈ ఓవర్‌లో మపోస 17 పరుగులు ఇచ్చాడు, ఇందులో సూర్య (24*) సిక్స్, ఫోర్ కొట్టగా.. అభిషేక్ ఒక ఫోర్ బాదాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 13 ఓవర్లకు 151/3గా ఉంది.