విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. లెక్చరర్‌కు దేహశుద్ధి (వీడియో)

27537చూసినవారు
AP: ప్రకాశం జిల్లాలో కీచక లెక్చరర్‌కు దేహశుద్ధి చేశారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసి లెక్చరర్‌ని చితకబాదారు. నాగులుప్పలపాడు మండలంలోని ఓ కాలేజీలో బక్కమంతుల వినయ్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు కాలేజీకి వచ్చారు. లెక్చరర్‌ని రోడ్డుపై పరిగెత్తించి దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్