రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన నటి

0చూసినవారు
రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన నటి
తనపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకర కామెంట్లపై నటి రేణు దేశాయ్‌ సీరియస్‌గా స్పందించారు. వ్యక్తిగతంగా దూషిస్తూ కొంతమంది నెటిజన్లు హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఆధారాలతో సహా తీసుకొని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కామెంట్ల స్క్రీన్‌షాట్లు, లింకులు సహా వివరాలను పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్