చిన్నారుల లైంగిక కంటెంట్ (CSEAM)ను ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేస్తున్న వారిపై రాజస్థాన్ పోలీసులు చర్యలు చేపట్టారు. సోమవారం 15,326 మొబైల్ నంబర్లు, సుమారు 7,800 వెబ్ లింకులు, సోషల్ మీడియా ప్రొఫైళ్లు, 100 ఎలక్ట్రానిక్ పరికరాలను బ్లాక్ చేసినట్లు సైబర్ క్రైమ్ అదనపు డీజీపీ వీకే సింగ్ తెలిపారు. రహస్య గ్రూపులు, ఛానళ్ల ద్వారా ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేస్తున్న వారిని గుర్తిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కంటెంట్ కనిపిస్తే డౌన్‌లోడ్ లేదా షేర్ చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.