ఆదోని చైర్‌పర్సన్‌‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు

10చూసినవారు
ఆదోని చైర్‌పర్సన్‌‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు
AP: కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి స్వప్న నాయకర్ ఘన విజయం సాధించారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఆదోని చైర్‌పర్సన్ స్థానం టీడీపీకి కేటాయించడంతో, జనసేన రెబల్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై బరిలోకి దిగిన ఆమె, 2,061 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. జనసేన ఇంచార్జ్ మల్లప్ప సతీమణి అయిన స్వప్న, టీడీపీ అభ్యర్థి పి. నాగమణి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జి. ప్రణీతపై నెగ్గి ఆదోని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్