
ఏషియన్ గేమ్స్: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల హాకీ జట్టు
ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో సౌత్ కొరియాపై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఇషికా చౌదరీ, కెప్టెన్ సలీమా టెటె గోల్స్ చేసి పతకాన్ని ఖాయం చేశారు. తొలి హాఫ్ తర్వాత పుంజుకున్న భారత జట్టు, ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాతో తలపడనుంది. ఈ విజయంతో భారత్‌కు గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ ఖాయమైంది.




