కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈ నెల 8న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో
ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు NDA పాలన,
నీట్ పేపర్ లీక్, ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించే ఛాన్స్ ఉంది. అయితే, టీవీకే పార్టీకి
కాంగ్రెస్ మద్దతివ్వడంతో డీఎంకే బంధం తెంచుకోగా, ఈ సమావేశానికి వారు హాజరవుతారా లేదా అనేదానిపై స్పష్టత లేదు.