
ట్రాన్సిట్ వీసా అవసరం లేదు.. భారతీయులకు జర్మనీ శుభవార్త
జర్మనీ మీదుగా ప్రయాణించే భారతీయులకు ట్రాన్సిట్ వీసా రహిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు జర్మనీ వెల్లడించింది. ఈ మేరకు భారత్‌తో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మర్ట్స్ భారత పర్యటనలో ఉండగా ఈ ప్రకటన వెలువడింది. ఈ సౌకర్యం వల్ల భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. ప్రధాని మోదీ జర్మనీ ఛాన్సలర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాధినేతలు విద్యా రంగం, నైపుణ్యాలు, డ్యుయెల్, జాయింట్ డిగ్రీ కోర్సుల విస్తరణపై చర్చించారు.




