గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో తమ పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ, హిమాలయాలు కరిగిపోవడం వల్ల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తమ దేశం నష్టపోతోందని నేపాల్ ఆరోపించింది. ఈ నష్టానికి గాను చైనా,
అమెరికా,
భారతదేశం పరిహారం చెల్లించాలని నేపాల్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ దేశ మంత్రి ఖనల్ మాట్లాడుతూ.. 'చైనా, US,
ఇండియా అత్యధిక కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. అవి నేపాల్ వంటి దేశాలకు పరిహారం చెల్లించాలి. ఇది దాతృత్వం కాదు, నైతిక బాధ్యత' అని అన్నారు.