
తుఫాను ఎఫెక్ట్.. దంచికొడుతున్న వర్షం (వీడియో)
AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. విశాఖలో ఉదయం నుంచి వాన పడుతోంది. బలమైన ఈదురుగాలులకు నగరంలోని పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. తిరుపతి, నెల్లూరు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. తుఫాన్ తీరం వైపు వచ్చే కొద్ది వర్ష ప్రభావం మరింత పెరుగుతుందని APSDMA తెలిపింది.




