యూఏఈలో అణువిద్యుత్‌ కేంద్రంపై దాడి.. ఖండించిన భారత్‌

0చూసినవారు
యూఏఈలో అణువిద్యుత్‌ కేంద్రంపై దాడి.. ఖండించిన భారత్‌
యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, రేడియేషన్ స్థాయిలో ఎలాంటి మార్పులు లేవని అధికారులు తెలిపారు. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. 'ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. ఇవి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి. తక్షణమే ఇరుపక్షాలు సంయమనం పాటించి.. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి' అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడి వెనుక ఇరాన్ లేదా దాని అనుబంధ సంస్థల హస్తం ఉండవచ్చని యూఏఈ అధ్యక్ష సలహాదారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్