సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్.. అత్యంత ఎత్తైన రోడ్డు నిర్మాణం

20378చూసినవారు
సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్.. అత్యంత ఎత్తైన రోడ్డు నిర్మాణం
భారత్ తూర్పు లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డును నిర్మించి సరికొత్త రికార్డును సృష్టించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) మిగ్ లా పాస్ వద్ద 19,400 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును నిర్మించింది. ఈ రోడ్డు వాహనాల రాకపోకలకు సిద్ధంగా ఉంది. హాన్లే ప్రాంతాన్ని ఫుక్చే గ్రామంతో అనుసంధానించే ఈ రోడ్డు, వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంది.   గతంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు పొందిన ఉమ్లింగ్ లా (19,024 అడుగులు) రికార్డును అధిగమించింది.

సంబంధిత పోస్ట్