
వామ్మో.. ఆ కుమ్ముడు ఏంది తల్లి (వీడియో)
ఢిల్లీ రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై వెనుక కూర్చున్న మహిళ కోపంతో పిడిగుద్దులు కురిపించిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనను చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తిని మహిళ కొడుతున్న దృశ్యం బాలీవుడ్ సినిమా ఫైటింగ్ సీన్‌ను తలపిస్తోంది. రోడ్డుపై చిన్న విషయాలకే గొడవలు జరగడం సర్వసాధారణం అయినప్పటికీ, ఈ వీడియోలో రొమాంటిక్ పాట నేపథ్య సంగీతంగా వినిపించడం మరింత ఫన్నీగా మారింది.




