ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


లోన్స్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. SBI వడ్డీ రేట్ల తగ్గింపు
Dec 15, 2025, 01:12 IST/

లోన్స్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. SBI వడ్డీ రేట్ల తగ్గింపు

Dec 15, 2025, 01:12 IST
రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపుతో ప్రస్తుత, కొత్త కస్టమర్లకు రుణాలు తీసుకోవడం చౌకగా మారింది. SBI ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేట్ (EBLR) 7.90 శాతానికి తగ్గింది. అన్ని కాలపరిమితులకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించగా, ఒక సంవత్సరం MCLR 8.75 శాతం నుండి 8.70 శాతానికి తగ్గింది. ఈ సవరించిన రేట్లు డిసెంబర్ 15 నుండి అమలులోకి రానున్నాయి.