ఉగ్రవాదంపై భారత్‌ ‘జీరో టాలరెన్స్‌’ విధానాన్ని అనుసరిస్తోంది: మోదీ

31చూసినవారు
ఉగ్రవాదంపై భారత్‌ ‘జీరో టాలరెన్స్‌’ విధానాన్ని అనుసరిస్తోంది: మోదీ
ఉగ్రవాదంపై భారత్‌ ‘జీరో టాలరెన్స్‌’ విధానాన్ని అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’లో మాట్లాడిన ఆయన.. ఉగ్రదాడులకు భారత్‌ తగిన సమాధానం ఇస్తోందన్నారు. 2016లో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ ఆపరేషన్‌ను మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో దేశం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్