ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళల జట్టు 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్ విధించిన 413 పరుగుల ఛేదనకు దిగిన టీమ్ ఇండియా 369 పరుగులకు ఆలౌటయ్యింది. స్మృతి మంధాన (125) సెంచరీతో ఆకట్టుకుంది. దీప్తి శర్మ (72), హర్మన్ ప్రీత్ (52) రాణించినా ఓటమి తప్పలేదు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బెత్ మూనీ (138) శతకంతో 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది.