ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితిపై జరిగిన చర్చలో, పాకిస్థాన్ తమ దేశంలో ఉన్న మిలిటెంట్ గ్రూపునకు 'ఫిత్నా అల్ హిందుస్తాన్' అని పేరు పెట్టిందని, ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సరిహద్దు పోరులో ఆ సంస్థ విధ్వంసానికి పాల్పడిందని పేర్కొంది. దీనిపై
భారత్ తీవ్రంగా స్పందించింది. యూఎన్‌లోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ, న్యూఢిల్లీని కళంకితం చేయడానికి ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోందని, పాకిస్థాన్ తన కల్పిత కథలతో ప్రజలను, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. భారత్‌పై విద్వేషాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే పాక్ ఈ కుట్రలు పన్నుతోందని, తన రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్‌పై ఆరోపణలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.