బ్రిటన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మోదీతోనూ మంచి స్నేహం ఉందన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. "ప్రధాని మోదీ నాకు సన్నిహితుడు. ఇటీవలే ఆయనతో మాట్లాడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశా. ఆయన కూడా ఓ అందమైన ప్రకటన చేశారు. అయినప్పటికీ వాళ్లపై ఆంక్షలు విధించా." అని ట్రంప్ పేర్కొన్నారు.