
క్రికెటర్ మహమ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు
భారత క్రికెటర్ మహమ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కోల్‌కత్తాలో షమీపై పెట్టిన గృహహింస, భరణం కేసులను ఢిల్లీకి మార్చాలని ఆయన మాజీ భార్య హసిన్ జహాన్ పిటిషన్ దాఖలు చేశారు. తాము ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నామని, కోర్టు కేసుల కోసం ప్రతిసారి కోల్‌కత్తాకు రావడానికి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీనిపై స్పందించాలని సుప్రీంకోర్టు షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా ఇటీవల తనకు, తన కూతురి నెలవారి జీవనాధారానికి ఇచ్చే భరణాన్ని రూ.4 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలని హసిన్ జహాన్ SCను ఆశ్రయించారు.




