అణుశక్తిలోనూ భారత్‌ ముందడుగు: ప్రధాని మోదీ

20చూసినవారు
అణుశక్తిలోనూ భారత్‌ ముందడుగు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్‌కీ బాత్‌ 133వ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని కల్పకంలో ఉన్న 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ దేశ దీర్ఘకాలిక అణు వ్యూహంలో కీలకమని తెలిపారు. ఈ రియాక్టర్‌ను పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం విశేషమని, మన అణు శాస్త్రవేత్తలు విజయం సాధించి దేశానికి గొప్ప పేరు తెచ్చారని ప్రధాని ప్రశంసించారు. పౌర అణు కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు ముందుకు తీసుకువెళ్తూ దేశ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్