ఐరాస విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ ఆగ్రహం

699చూసినవారు
ఐరాస విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ ఆగ్రహం
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలపై నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ విడుదల చేసిన 'ఎలిమెంట్స్ పేపర్'పై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని ఈ నివేదికను పక్షపాతంతో కూడుకున్నదని, పలు దేశాల అభిప్రాయాలను తప్పుగా చూపించిందని మండిపడ్డారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాలనే డిమాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్దతును నివేదిక సరిగ్గా ప్రస్తావించలేదని ఆయన సోమవారం జరిగిన సమావేశంలో అన్నారు. శాశ్వత సభ్య దేశాల జోలికి వెళ్లకుండా, కేవలం తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచితే సరిపోతుందని నివేదిక సూచించడమే వివాదానికి కారణమైంది.

సంబంధిత పోస్ట్