మూడో ఆర్థికశక్తి దిశగా భారత్‌ ఎదుగుతోంది: యూకే ప్రధాని

88చూసినవారు
మూడో ఆర్థికశక్తి దిశగా భారత్‌ ఎదుగుతోంది: యూకే ప్రధాని
యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ గురువారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. భారత ఆర్థిక ఎదుగుదలపై స్టార్మర్‌ ప్రశంసలు కురిపించారు. ‘‘భారత్‌ ఇప్పటికే జపాన్‌ను అధిగమించి నాలుగో ఆర్థికశక్తిగా నిలిచింది. 2028 నాటికి మూడో స్థానంలోకి చేరే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది’’ అని అన్నారు. 2047 నాటికి భారత్‌ వికసిత్‌ దేశంగా మారుతుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ట్రంప్‌ చేసిన ‘డెడ్‌ ఎకానమీ’ వ్యాఖ్యలకు ఆయన పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు.