
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మరో నౌకపై దాడి: 15 మంది ఇండియన్స్ సేఫ్
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మరో వాణిజ్య నౌకపై ఇరాన్ మిసైల్ దాడి చేసింది. 'స్కైలైట్' అనే ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన ఈ దాడిలో 20 మంది సిబ్బంది ఉండగా, వారిలో 15 మంది భారతీయులు ఉన్నారు. ఓమన్ సహాయక చర్యలతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం యూకేఎటీఓ మరో రెండు నౌకలపై దాడులు జరిగినట్లు నివేదించింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించినట్లు సమాచారం. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) కీలక జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.




