ఇజ్రాయెల్‌తో హెరాన్ మార్క్-2 డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న భారత్

94చూసినవారు
ఇజ్రాయెల్‌తో హెరాన్ మార్క్-2 డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న భారత్
భారత సైనిక దళాలకు ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగపడిన హెరాన్ మార్క్-2 డ్రోన్లను అత్యవసర నిబంధనల కింద అదనంగా కొనుగోలు చేయడానికి భారత్ ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే భారత సైన్యం, వాయుసేన వద్ద ఉన్న ఈ డ్రోన్లను నౌకాదళంలోనూ ప్రవేశపెట్టనున్నారు. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఈ అధునాతన డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా, భారత్‌లో తయారీకి కూడా తోడ్పాటు అందిస్తుంది. ఈ డ్రోన్లు 35వేల అడుగుల ఎత్తులో 45 గంటల పాటు గాల్లో ఉండి, శత్రువులపై నిఘా వేయగలవు.

సంబంధిత పోస్ట్