భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లో తావి నది ఉప్పొంగే అవకాశం ఉన్న నేపథ్యంలో వరదలపై పాక్‌ను భారత్ అలర్ట్ చేసినట్లు పీటీఐ కథనం వెల్లడించింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ఈ సమాచారం పాక్ అధికారులకు అందజేసిందని స్థానిక మీడియా తెలిపింది. అయితే దీనిపై భారత్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.