భారత్, జపాన్ సహకారం మరింత బలోపేతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ టోక్యోలో 16 మంది జపాన్ ప్రిఫెక్చర్ గవర్నర్లతో భేటీ అయ్యారు. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కింద రాష్ట్ర-ప్రిఫెక్చర్ సహకారాన్ని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ పర్యటన సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి జపాన్, భారత్ మధ్య 13 ఒప్పందాలు జరిగాయి.