
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల నేపథ్యంలో మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం వంటి అంశాలతో చివరిదశలో మార్కెట్లు కోలుకున్నాయి. సెన్సెక్స్ 173.77 పాయింట్లు పతనమై 82,327.05 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 25,227.35 వద్ద ముగిశాయి. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 88.66 వద్ద ఉంది.




