
80 ఏళ్ల వృద్ధురాలిపై వ్యక్తి అత్యాచారం.. అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దారుణం జరిగింది. 80 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిపై పొరుగున నివసించే 26 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సాయం కోసం ఆమె కేకలు వేయడంతో స్థానికులు రావడంతో నిందితుడు పారిపోయాడు. రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




