ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరగనున్న టి20 వరల్డ్ కప్ మ్యాచ్ పై అంచనాలు పెరిగాయి. గతంలో జరిగిన మ్యాచ్ లలో భారత్ పాకిస్తాన్ పై అద్భుత విజయాలు సాధించింది. ఆసియా కప్ లోనూ భారత్ పైకి నిలిచింది. ఈ మ్యాచ్ లోనూ భారత్ ఫేవరెట్ గా కనిపిస్తున్నా, ఇటీవల ఫామ్ లోకి వచ్చిన పాకిస్తాన్ జట్టు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. క్రికెట్ విశ్లేషకులు ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుందని అంచనా వేస్తున్నారు. భారత జట్టు బ్యాటర్లు భారీగా పరుగులు చేసి పాకిస్తాన్ ను చుక్కలు చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.