
10 మందిని చంపిన నర్సుకు జీవిత ఖైదు
పశ్చిమ జర్మనీలోని వుర్సెలెన్ లోని ఓ ఆసుపత్రిలోని నర్సు 10 మంది ప్రాణాలను బలిగొన్నాడు. డిసెంబర్ 2023 నుండి మే 2024 మధ్య, పనిభారం తగ్గించుకోవడానికి వృద్ధ రోగులను ప్రాణాంతక ఇంజెక్షన్లతో హత్య చేశాడు. మరో 27 మందిని హత్యాయత్నానికి పాల్పడిన అతడిని, దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ప్రాసిక్యూటర్లు అతడు రోగుల పట్ల సానుభూతి లేకుండా ప్రవర్తించాడని ఆరోపించారు.




