మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఉరిశిక్ష విధించడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘షేక్ హసీనాపై అంతర్జాతీయ బంగ్లాదేశ్ క్రిమినల్ ట్రిబ్యునల్ (IBCT) ఇచ్చిన తీర్పును భారతదేశం గుర్తించింది. దగ్గరి పొరుగు దేశంగా, భారతదేశం బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉంది. అందులో శాంతి, ప్రజాస్వామ్యం, సమగ్రత, స్థిరత్వం ఉన్నాయి. ఈ లక్ష్యంతో మేం ఎల్లప్పుడూ అందరితో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.