ఏషియన్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు అజేయంగా దూసుకుపోతోంది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8-2తో గెలిచి పూల్-ఏలో అగ్రస్థానాన్ని పటిష్ఠం చేసుకుంది. ఇది ప్రస్తుత క్రీడల్లో భారత్‌కు వరుసగా మూడో గెలుపు. దిల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్ చేశారు. ఆసియా గేమ్స్ చరిత్రలో దక్షిణ కొరియాపై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఆతిథ్య జపాన్‌తో తదుపరి మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. కాగా, ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 15 పతకాలు సాధించింది.