ప్రపంచ ఆల్కహాల్ మార్కెట్‌లో
భారత్ తన సత్తా చాటుతోంది. జనవరి నుండి జూన్ వరకు మొత్తం పానీయాల ఆల్కహాల్ (TBA) అమ్మకాలు 7 శాతం పెరిగి 440 మిలియన్ లీటర్లకు పైగా చేరాయి. స్పిరిట్స్ విభాగంలో భారతీయ విస్కీ అత్యధిక అమ్మకాలను నమోదు చేయగా, వోడ్కా 10 శాతం, రమ్ 2 శాతం, జిన్, జెనెవర్ 3 శాతం వృద్ధిని సాధించాయి. IWSR నివేదిక ప్రకారం,
భారత్ 20 ప్రపంచ మార్కెట్లలో అత్యంత వేగవంతమైన అమ్మకాలతో కొత్త రికార్డు సృష్టించింది. 2027 నాటికి
భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆల్కహాల్ ఉత్పత్తిదారుగా అవతరించనుంది.