ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


వాట్సప్‌లోనే అన్ని సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?
Jul 10, 2026, 15:07 IST/

వాట్సప్‌లోనే అన్ని సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?

Jul 10, 2026, 15:07 IST
టెక్నాలజీ యుగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే, బ్యాంకులు, ఇతర సంస్థలు వాట్సాప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చాయి. దీని ద్వారా ప్రజలు తమ గుర్తింపు ధృవీకరణ పత్రాలు, మార్క్ షీట్లను మైగవ్ హెల్ప్ డెస్క్ (9013151515) ద్వారా పొందవచ్చు. ఇండియన్ రైల్వే ప్రయాణికులకు ఆహారం (70420 62070), కిరాణా సామాగ్రి (8881199119) ఆర్డర్ చేసే సదుపాయాన్ని కల్పించింది. SBI (90226 90226) మరియు ICICI బ్యాంక్ (86400 86400) వంటివి వాట్సప్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ వంటి సేవలను అందిస్తున్నాయి. అంతేకాకుండా, ఇండేన్ గ్యాస్ (75888 88824), HP గ్యాస్ (92222 01122), భారత్ గ్యాస్ (18002 24344) నంబర్ల ద్వారా గ్యాస్ సిలిండర్లను కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చు.