భారత జీడీపీ వృద్ధి 6.6 శాతమే: నివేదిక

72చూసినవారు
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతమే: నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతానికి తగ్గే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ వెల్లడించింది. గతంలో అంచనా వేసిన 7.1 శాతం వృద్ధిని తాజాగా సవరించింది. ‘ఇండియా ఫార్వర్డ్‌’ పేరుతో విడుదల చేసిన సంయుక్త నివేదికలో ఇంధన, ఆహార భద్రత రంగాల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని సూచించింది. పశ్చిమాసియా సంక్షోభం, చమురు-గ్యాస్‌ ధరల పెరుగుదల, రూపాయి మారకం హెచ్చుతగ్గులు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయని పేర్కొంది. ఎరువుల కొరత ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you