
పరువు హత్య.. యువతిని కాల్చేసి నదిలో పడేశాడు
మధ్యప్రదేశ్లో పరువు హత్య వెలుగు చూసింది. నదిలో యువతి మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మృతురాలు మోరానా జిల్లాకు చెందిన దివ్య సికార్వర్ (17)గా గుర్తించారు. దివ్య వెనకబడిన కులానికి చెందిన యువకుడితో స్నేహం చేస్తుందని ఆమె తండ్రి భరత్ సికార్వర్కు తెలిసింది. దాంతో దివ్యను తుపాకీతో కాల్చి, మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి కున్వారీ నదిలో విసిరేశాడని విచారణలో తేలింది.




