భారత్ 'ఆపరేషన్ త్రిశూల్'.. అప్రమత్తమైన పాక్‌

9417చూసినవారు
భారత్ 'ఆపరేషన్ త్రిశూల్'.. అప్రమత్తమైన పాక్‌
భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన సంయుక్తంగా 'ఆపరేషన్ త్రిశూల్' పేరుతో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతంలో భారీ విన్యాసాలు నిర్వహించనున్నాయి. దీని కారణంగా అప్రమత్తమైన పాకిస్థాన్ తన కేంద్ర, దక్షిణ ప్రాంతాల్లో వైమానిక మార్గాలపై నోటమ్‌ జారీ చేసి ఆంక్షలు విధించింది. ఈ మేరకు 28,000 అడుగుల ఎత్తులోని గగనతలాన్ని విన్యాసాల కోసం రిజర్వ్ చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత సరిహద్దును నిశితంగా గమనిస్తున్నామని చెప్పేందుకే పాక్‌ తాజాగా నోటమ్‌ జారీ చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్