
కల్తీ నెయ్యి కేసు.. చిన్నప్పన్నకు షరతులతో కూడిన బెయిల్
AP: కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన చిన్నప్పన్నకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయి, ఛార్జ్‌షీట్ దాఖలైనందున నిందితుడిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. రూ.లక్ష విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. అలాగే, రెండు వారాల్లో తన స్థిర, చరాస్తుల వివరాలతో ట్రయల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.




