ఫిబ్రవరి 16 ఉదయం నుండి 17 వరకు 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో AI బాధ్యతాయుత వినియోగంపై ప్రతిజ్ఞలు స్వీకరించిన దేశంగా భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2,50,946 మంది పౌరులు, విద్యార్థులు AIని నైతికంగా ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ప్రవీణ్ పటేల్ ఈ రికార్డును ధృవీకరించారు. మొదట్లో 5,000 ప్రతిజ్ఞలు వస్తాయని అంచనా వేయగా, ఊహించని విధంగా భారీ స్పందన లభించింది.