అయోధ్య రామమందిర ధ్వజారోహణంపై పాకిస్థాన్ చేసిన విమర్శలకు భారత్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, మైనారిటీల అణచివేత చరిత్ర కలిగిన పాకిస్థాన్‌కు ఇతరులకు నీతులు చెప్పే అర్హత లేదని, కపట ఉపన్యాసాలు మానేసి తమ దేశ మానవ హక్కుల రికార్డుపై దృష్టి పెట్టాలని సూచించారు. ముస్లింల వారసత్వాన్ని చెరిపేసే ప్రయత్నం జరుగుతోందన్న పాక్ వ్యాఖ్యలను ఖండించారు. సుప్రీంకోర్టు తీర్పుతో పూర్తయిన రామమందిర నిర్మాణంపై పాక్ వ్యాఖ్యలు అనర్హమని పేర్కొన్నారు.