ISSF జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు అగ్రస్థానం

7759చూసినవారు
ISSF జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు అగ్రస్థానం
కైరోలో జరిగిన అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిరోజు భారత షూటర్లు ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి రెండు పతకాలు సాధించారు. మొత్తం 5 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి 16 పతకాలు సాధించి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో హేమంత్‌ బర్మన్‌ రజతం, ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో జుహైర్‌ ఖాన్‌–ఆద్యా కత్యాల్‌ జోడీ కాంస్యం సాధించారు.

సంబంధిత పోస్ట్