రేపు భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు

71చూసినవారు
రేపు భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
భారత్–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా రేపు (సోమవారం) కీలక చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు నాలుగు రోజుల పర్యటన కోసం అమెరికా ప్రతినిధి బృందం ఢిల్లీకి చేరుకోనుంది. ఈ బృందానికి బ్రెండన్ లించ్ నేతృత్వం వహించనుండగా, భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పన్ జైన్ నాయకత్వం వహించనున్నారు. అయితే ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన కొన్ని సుంకాలను రద్దు చేయడంతో వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తుది ఒప్పందంలో మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్స్ :